వెతుకులాట
ఎవరో చెప్పారు..
పాకినడచిపరిగెత్తుట నడుమ బాల్యమున్నది..దాటిన పిమ్మట బ్రతుకన్నది.
అందరూ దేని వెనకాలో పడుతున్నారు..కొందరు కలల వెనకాల..ఇంకొందరు పిల్లల భవిష్యత్తు వెనకాల..మరికొందరు డబ్బు వెనకాల..మూర్ఖులు పగల వెనకాల...
కొన్ని దినాల సంది నాకనిపిస్తూ ఉంది..
నే తప్పిపోయాను..ఎక్కడో...ఎక్కడో తప్పిపోయాను....
కానీ ఎవరికీ పట్టట్లేదు..
అందుకని...
నన్ను నేనే వెతుక్కుంటున్నాను...ఒంటరిగా వెతుక్కుంటున్నాను..
ఎక్కడా జాడైనా లేదు...
వెతుకుతున్నప్పుడు...అప్పుడప్పుడు ఏదో ఒక చోట నాలాంటి నేనే అని అనిపించినా,కనిపించినా..నేను కాదు...
నాకు నేను కావాలి... కనిపించకుండా పోయిన నేను కావాలి..
అసలెందుకు అగుపడట్లేదో నాకే అర్ధమవ్వట్లేదు...
ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా..నా జాడ తెలియట్లేదు... అసలు ప్రాణాలతోనే ఉన్నానా?? ఆ ఆలోచనకి
భయమేసింది...కొన్ని రోజులు వెతుకులాట ఆపి భయపడ్డాను..భాదపడ్డాను..బాధ, భయం లేక కాదు..అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు.. కానీ నేను లేను...నా స్థానంలో శూన్యం ఉంది. ఆ శూన్యంలోనే వెతుకులాట మొదలుపెట్టాను..నా కోసం...
తను లేకపోవడం వల్లే నాకీ లోటని అనుకుందేమో సరస్వతీదేవి నా దగ్గరకి వచ్చింది... అయినా లోటు తీరలేదు..దారి మధ్యలో గెలుపు పలకరించింది ..ఊహు ఏం మారలేదు. నాకోసమే వీడి విరహవేదన అని అనుకున్నట్టు ఉంది..ఈసారి లక్ష్మీదేవి కూడా వచ్చేసింది.ప్రేమ, తోడు కి కొదవలేదు..
బానే ఉన్నావా?? ఉన్నాను...
అప్పుడు ఉన్నదేంటి..ఇప్పుడు లేనిదేంటి?
భయాలు లేవు, బాధలు అంతకన్నా లేవు... ఆనందానికి కొదవ లేదు..ఇంకా కావాలన్న ఆశ అంత కన్న లేదు..
నే నా పేరునే అరుస్తున్నా..నేను వినిపించుకోలేకున్నా!!
కళ్ళు మూసి ఏడ్చిన రోజులు ఎన్నో..
నాలోని నిశ్శబ్ధం నవ్వుతుంది...
అలుపేరాని వెతుకులాట నాది...
నాకోసమై నే వ్రాసుకున్న ఉత్తరం నేను..
మరి చిరునామా? ప్రశరించే కిరణాలకి తెలుసా తన గమ్యమేమిటో!!
నాలో నేను తొంగిచూస్తున్నా..నేనెక్కడున్నా వెతికి పట్టుకుంటా!! కళ్లెం దొరికేదెప్పుడో!!
వశిష్ఠ
Excellent man!
ReplyDeleteThanks 😀😀😀🤗😀😀
ReplyDelete