God of Gods - Chapter 4

God of Gods - Chapter 4

తన తల్లిని చంపిన దేవుడిని అంతం చేయాలని పిల్లవాడు పంతంగా ఉన్నాడు. కానీ ఎలా? ఎప్పుడు? చేసాడా లేదా?చేస్తే ఎలా,ఏం చేసాడు అనేదే మన కధ.

పిల్లవాడికి దేవుడి మీద ఎంత కోపం ఉన్నా సరే...దేవుడిని కాలితో తాకాలి అంటే భయపడ్దాడు. లోలోపల దేవుడు అంటే గౌరవం,భయం రెండూ ఉన్నాయన్నమాట.. కానీ దేవుడే తనకుతానుగా వచ్చి తన కాలుకి తాకాడు. ఎందుకు? నది ప్రవహించి సముద్రంలో కలుస్తుంది కానీ సముద్రం నదిలోకి చివరికంటా వెనక్కి రాదు కదా! కానీ ఎందుకు వచ్చింది?

పిల్లవాడికి సందేహం కన్నా భయమే ఎక్కువ వేస్తుంది. దేవుడు ఇంకా నవ్వుతూనేఉన్నాడు. అది ప్రాణప్రదాత నవ్వా? లేక మ్రుత్యు దేవత చేసే వికటాట్టహాసమా? అర్ధమవ్వలేదు. మొదటిసారి చనిపోతానేమో అన్న భయం కలిగింది. పిల్లవాడికి భయంకలిగిన మరుక్షణంలో దేవుడిగా నీ పాత్ర ముగిసిపోయింది.ఆ పిల్లవాడిగా మొదలయ్యింది.ఇన్ని రోజులు నువ్వే దేవుడివి.కానీ ఇప్పటినుండి నువ్వు పిల్లవాడివి.

చూస్తూండగానే పిల్లవాడు ఇద్దరుగా విడిపోయాడు. ఒకడు ఆత్మ..రెండు దేహం. దేవుడు మాయం అయ్యాడు. ఇందాక దేవుడు,పిల్లోడు ఉండాల్సిన చోట ఇప్పుడు పిల్లవాడి ఆత్మ,దేహం మాత్రమే ఉన్నాయి. దేవుడితో ఎందుకు నీకు గొడవ? అని నీ ఆత్మ అడగగానే,నీ ఆత్మ కూడా నీకు వ్యతిరేకం అని అర్ధమయ్యి కోపంతో నీ దేహం నీ ఆత్మమీద కలబడింది. ఆఖరికి నీకు,నీ ఆత్మ కి కూడా గొడవ పెట్టేసాడు. 

బాహాబాహీ తేల్చుకుందామని ముట్టుకుంటుంటే ఆత్మ,దేహం ఒక్కటైపోతున్నాయి. కానీ వెంటనే విడిపోయి ఆత్మ దేవుడికి,దేహం పిల్లవాడికి మద్దతు ఇస్తున్నాయి. నీ ఆత్మ పైన నీ దేహానికి కోపం పెరిగిపోతుంది. ఆ కోపంతో కలబడటానికి దేహం దెయ్యంలా నవ్వుతూ ఆత్మ మీదకి దూకుతుంటే మళ్లీ ఆత్మ,దేహం ఒక్కటైపొతున్నాయి. ఆత్మ మాత్రం ఎప్పుడూ ఒకేలాగ ఉంటుంది. అది ఇంకా నీ దేహానికి కోపం తెప్పిస్తుంది. ఎందుకో దేహం ఒక్క క్షణం పాటు ఆగి ఏదో ఆలోచించి, ఒక్కసారిగా తనని తాను హింసించుకోవడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఆత్మ కి నొప్పి కలగడం మొదలయ్యింది. నీ దేహానికి కూడ నొప్పి కలుగుతున్నా,ఆత్మ కి నొప్పి కలుగుతుంది అని ఇంకా ఇంకా పైశాచికంగా బాధ పెట్టుకుంటుంది.

ఆత్మకి బాధ ఎక్కువయ్యేకొద్ది గట్టిగా రోదిస్తుంది. ఇంక నొప్పి తాళలేక గట్టిగా అరిచింది. ఒక్కసారిగా మొత్తం కంపించసాగింది. ఆత్మ పైకి ప్రశాంతంగా ఎగరుతుంది,కానీ దేహం కిందకి అగాధంలోకి జారిపోతుంది.ఆత్మ దేహాన్ని గట్టిగా తన చేత్తో పట్టుకుంది. ఇద్దరి బలాలు ఒకటే ఆయినా దేహానికి కోపం,అహం ఉండటం వలన వాటి బరువు దేహాన్ని బలంగా కిందకి లాగేస్తుంది. ఆత్మని కూడ ఒక శక్తి బలంగా పైకి లాగేస్తుంది. అయినాసరే ఆత్మ దేహాన్ని వదలట్లేదు,చేతిని అలానే గట్టిగా పట్టుకుంది. ఇద్దరిని రెండు శక్తులు వ్యతిరేకమైన దిక్కులలో లాగేస్తున్నాయి. అప్పుడు దేహానికి చావు కనపడి ఆశ వదిలేసింది,కానీ ఆత్మ వదల్లేదు.ఆత్మ కి కళ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, దేహానికి కూడా!! దేహానికి ఆత్మ అంటే కోపం పోయింది. దేహం కళ్లలో నుండి నీరు పైకి,ఆత్మ కళ్లనుండి కన్నీరు క్రిందకి జారాయి.అలా జారిన ఇద్దరి కన్నీటిచుక్కలు ఆ శూన్యంలో ఒకదానితో ఒకటి కలిసాయి.మరుక్షణంలో ఆత్మ,దేహం కలిసిపోయాయి. వెనువెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు.


నీ ఆత్మ నీ దేహానికి పూర్తి స్వేచ్చని ఇచ్చేసింది.ఏదో సాదించేసాను అన్న ఆనందంతో నువ్వు దేవుడిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టావు...

నువ్వు/పిల్లోడు : మా అమ్మని ఎందుకు చంపేసావు?మా అమ్మని నా నుండి ఎందుకు వేరు చేసావు? దూరం చేసి ఎందుకు నా జీవితాన్ని బాధమయంగా మార్చావు?
దేవుడు : హా హా హా... ఇప్పుడు కొత్తగా వేరు చేయడం ఏంటి? నువ్వు పుట్టినప్పుడే మీ అమ్మలో నుండి వేరు చేసాను. ఇంక నీ జీవితంలో బాధ అంటావా? అసలు నీ జీవితం మొదలయ్యిందే నువ్వు మీ అమ్మ నుండి వేరు అయినప్పుడు కదా!! అమ్మ నుండి వేరు అవుతూనే పుట్టావు !! ఇంక నేను ఎక్కడ వేరు చేసింది?
నువ్వు/పిల్లోడు : అప్పుడు వేరు మాత్రమే చేసావు కానీ దూరంగా లేదు, ఎప్పుడూ నా పక్కనే ఉండేది. ఇప్పుడు శాశ్వతంగా దూరం చేసేసావు.ఎందుకు? ఎందుకు చంపేసావు?
దేవుడు : ఎప్పుడైనా,ఒక్కసారి అయినా అమ్మని ఎందుకు పుట్టించావు అని అడిగావా? ఇప్పుడు ఎందుకు చంపేసావు అని మాత్రం అడుగుతున్నావు??
సమాధానం చెప్పగలవా?? పైగా మీ అమ్మని చంపిన నన్ను అంతం చేసి నీ పగ తీర్చుకుంటాను అంటున్నావు..నిజమేనా?
నువ్వు/పిల్లోడు : అవును..మా అమ్మని చంపినవాడిని చంపడం తప్పు ఎలా అవుతుంది.అదే ధర్మం!
దేవుడు : అయితే పగ తీర్చుకోవడం ధర్మం అంటావు.
నువ్వు/పిల్లోడు : అవును..ముమ్మాటికి అదే.
సరే ఐతే.. భూమి నుండి చెట్టు పుడుతుంది,చెట్ల నుండి పళ్లు పుడతాయి. మానవులు తమ అవసరాల కోసం తన పిల్లలు అయిన చెట్లని,పళ్లని చంపేస్తూ భూదేవికి గర్భశోకం మిగుల్చుతున్నారు కదా! నీలాగే భూమాత కూడా పగబట్టి మీ అమ్మని,మిగతావాళ్లని చంపేసింది. నువ్వు చెప్పిన,చేయాలి అనుకున్న ధర్మమే కదా ఇది. పిల్లోడి దగ్గర సమాధానం లేదు.
దేవుడు ఇలా అంటున్నాడు..
నువ్వు చెప్పిన ప్రకారం..నీ ధర్మానికే కదా మీ అమ్మ బలి అయ్యింది.అంటే మీ అమ్మ చావుని నువ్వు కూడా సమర్దించినట్టే కదా! నీ ధర్మం మీ అమ్మని చంపేస్తే నేను చంపేసానని నన్ను అంటున్నావు. ఏమైనా అర్ధం ఉందా? పైగా నన్ను అంతం చేస్తాను అంటున్నావు...
నిన్ను పదినెలలు తనలో ఉంచుకుని ఆ తల్లి నీకు జన్మనిచ్చింది,అలాగే ఈ భుమాత కూడా నువ్వు చనిపోయేవరకు నిన్ను తనలోనే ఉంచుకుని సాకుతుంది,చనిపోయిన తర్వాత నిన్ను తనలో కలిపేసుకుంటుంది.నీలాగానే మీ అమ్మమ్మకి కూడా మీ అమ్మ అంటే ఇష్టం అందుకే మీ అమ్మని  తన దగ్గరకి
తీసుకుని వెళ్ళిపోయింది.
పిల్లవాడికి దు:ఖం ముంచుకోస్తుంది.ఏడ్చాడు..ఏడ్చాడు.ఏడ్చి ఏడ్చి..చాలా నెలల తర్వాత కుదుటపడ్డాడు.
పిల్లాడు దేవుడి కళ్లల్లోకి చూశాడు..చూస్తూ ఉండగా..దేవుడు "పుట్టుక,మరణం మాత్రమే నిజం,శాశ్వతం. తక్కినవన్నీ అశాశ్వతం" అని అన్నాడు.
నన్ను అంతం చేస్తా అన్నావు కదా!! నువ్వు ఇంకా బ్రతికేఉన్నావని అనుకుంటున్నావా?అని అడిగి మాయమయ్యాడు.

To be continued...

Thanks
Vamsikrishna Bazaru.

Comments

Popular Posts