విచిత్ర కుటుంబం
మాదొక విచిత్ర కుటుంబం. సూర్యుడు మా నాన్న. పొద్దున అవ్వగానే పనికి వెళ్ళి సాయంత్రానికి ఎప్పుడో ఇల్లు చేరుతాడు. నాన్న తెచ్చే, ఇచ్చే భరోసా ఎంతో అవసరం. మా అమ్మ, ఎంతో ఓర్పు గల శక్తి. ఎప్పుడు తవ్వారో తెలియదు కానీ, మా ఇంటి పక్కనే పెద్ద ఉప్పు నీటి మడుగులు, అవే సముద్రాలు, మా ఇంటి గుండా పారే నీటి ప్రవాహాలు, నదులు. ఇంక మా అన్నలు, పెద్ద పెద్ద గుబురు మీసాలు, గడ్డాలు పెంచుకునే జీవులు. వారే అడవులు, చెట్లు, పుట్టలు. మా అక్కలు, మా అమ్మ లాగే ఉంటారు. ఒకరు నల్లగా, మరొకరు ఎర్రగా, ఇంకొకరు బంగారపు వర్ణంలో మరియు చామనఛాయ రంగులో ఉంటారు. చూడటానికి ఎంతో అందంగా ఉంటారు. మా ఇంట్లో అందమంతా వాళ్ళదే. మా ఇంట్లోనే కాదు, ఎక్కడైనా అందం అంటే ఆడవారే కదా!! మాకు ఏ లోటూ లేదు, మేమంతా ఒకటే, మాదంతా ఒకటే. మా నాన్నకి కోపం ఎక్కువ. ఆయన తీవ్రతను తగ్గించడానికి అన్నట్టు మా తాతలు, బామ్మలు మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటారు... వాళ్ళే ఓజోన్ పొరలు. ఆయన కొన్నిసార్లు అలిగి రావడం మానేస్తారు కూడా. మా అమ్మ కూడా... అప్పుడప్పుడు కోపంతో ఊగిపోతుంది. అవి సర్వసాధారణం. ఇంక మా బంధువులు కొంచెం ప్రత్యేకం... వేసవి వెళ్ళిన తర్వాత వస్తారు. మా ఉప్పు మడుగుల నుండి తోడుక...