Love Triangle - ముక్కోణపు ప్రేమ కథ
ఇది ఒక ముక్కోణపు ప్రేమ కథ... అంటే ముగ్గురితో ముడివేసుకున్న కథ.
ఈ అనంత విశ్వంలో.. ఒక అమ్మాయి, ఇద్దరబ్బాయిలు. తను పగలు అంతా ఒకడితో ఉంటుంది. రాత్రి అవగానే రెండవవాడు వస్తాడు.
మొదటివాడు ఎర్రగా, రెండవ వాడు కొంచెం నల్లగా ఉంటారు. అమ్మాయి పచ్చని వర్ణంలో ముగ్గురిలోకెల్లా అందంగా ఉంటుంది. ఊహా తెలిసినప్పటినుండి రెండవవాడు ఆ అమ్మాయి చుట్టూనే తిరుగుతున్నాడు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా!! ఆ అమ్మాయి మొదటివాడి చుట్టూ తిరుగుతుంది. ఎర్రగా ఉంటాడు కదా అని ఏమో!! అయినా రెండవాడు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్నాడు. ఎన్నో యేళ్ళగా ఇదే తంతు.
కొసమెరుపు
కొసమెరుపు ఏంటంటే ఆ ఇద్దరూ లేకుండా తనకి రోజు గడవదు.
అందుకని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే పగలు ఒకరు, రాత్రికింకొకరు.
ఇద్దరిలో రెండవవాడు బలహీనుడు. అందుచేత ఎల్లప్పుడూ తనకి ఆమె ప్రేమ కావాలని పరితపిస్తాడు. కానీ మొదటివాడు చూపే ప్రేమలో ఆమెకి పగలంతా ఈ రెండవవాని తలంపుకూడా రాదు. ఆమె కళ్ళకి వీడు కనిపించడు.
నగ్నసత్యం
పైగా మొదటివానికి తిను ఒక్కత్తే కాదు, కానీ రెండవవానికి తిను ఒక్కత్తే.
ముందే చెప్పినట్టు మొదటివాడు బలవంతుడు. మొదటి వాడి వలనే రెండవ వాడికి పని, ఉనికి. వాడిలో వెలుగులు నింపినది అతడే.. రెండవవాడి సంపాదనంతా మొదటివాడి పెట్టుబడే!! దానితోనే రెండవవాడు ఆమె దగ్గర హంగులు చేస్తాడు.
రెండవవాడు ఒక్కొక్కరోజు ఒక్కోలా ఉంటాడు. కొన్నిసార్లు రావడం మానేస్తాడు. కానీ మొదటివాడు ఎప్పుడూ ఒకేలా ఉంటాడు.
బిడ్డ
అదేంటో కానీ కొన్నిసార్లు ఇద్దరూ రాకుండా ఉంటారు. ఆ రోజుల్లోనే ఆమె దగ్గరకి తన బిడ్డ వస్తుంది. మొదటివాని వల్ల కలిగిన సంతానం. బిడ్డ వస్తే తండ్రి ఉండడు. తండ్రి ఉంటే బిడ్డ ఉండదు. ఒక్కోసారి చాలా అరుదుగా తండ్రీబిడ్డలు కలిసి వస్తారు. అప్పుడు అమె మనసంతా రంగులమయం అవుతుంది.
తగువు
ఒక్కోసారి రెండవవాడు తనది కానీ వేళలో ఆమె వద్దకి రావాలని ప్రయత్నిస్తాడు. పెద్ద గొడవే అయిపోతుంది అప్పుడు. కొన్నిసార్లు మాత్రం ఆమె రెండవవాడు వచ్చే వేళలో మొదటివాడికోసం పరితపిస్తూ రెండవవాడు రాకుండా తనకి తనే అడ్డుకుంటుంది. మళ్లీ మామూలైపోతుంది.
అలా ఎన్నో యేళ్లుగా ఆ ముగ్గురూ హాయిగా, సంతోషంగా గడిపేస్తున్నారు.
ఇదే మన భూమీసూర్యచంద్రుల ముక్కోణపు ప్రేమ కథ. సూర్యుని చుట్టూ తిరిగేది భూమి. భూమి చుట్టూ తిరిగేది చందమామ. పగటి పూట వచ్చేది భానుడు, రాత్రి పూట వచ్చేది శశి. రవికి, పుడమికి పుట్టిన బిడ్డే వర్షం! తండ్రీబిడ్ద కలిసివచ్చినప్పుడు కలిగే సంతోషమే ఇంద్రధనస్సు. మొదటివాడు, రెండవవాని గొడవలే గ్రహణాలు.
ఇదే నేను చూసి రాసిన ముక్కోణపు ప్రేమ కథ!!
ధన్యవాదములు
వశిష్ఠ ✍️
Superb
ReplyDeleteThank you so much..
DeleteYemundhi sir indhulo.. 1st paragraph lo ne thelisindhi earth sun moon gurinchi.. katha raasanu ante yemo anukuni open chesaa..
ReplyDeleteThanks for reading 😀🙏
ReplyDeleteNumber size 10 shoe andhariki fit avvadhu kadha sir 😅😅and intentionally exposed the plot in the first paragraph itself. Ardham aina vallaki ardham avthadhi kani vallaki last lo. Once again thanks for reading ☺️☺️
COK screenplay laaga nicely done climax. Good short read raa 😂♥️
ReplyDeleteThanks for reading 😀😀 - VasisTa
ReplyDelete