తాను నేను
Prompt #69 : Someone Is Glad You Exist
You know what happened today? ఇంటికి వస్తుంటే... అంటూ తను ఏదో చెప్పడం స్టార్ట్ చేసింది.
ఈవెనింగ్ 5:00 కి ఇంట్లో comfortable clothes వేసుకొని, noon power nap ఇచ్చిన చిన్నపాటి జోష్ లో ఉంటూ, మనసు కలవరపెట్టే విషయాలు ఏమీ లేనప్పుడు.. ఆహ్లాదకరమైన ఈ సాయంత్రం అన్నీ perfect గా ప్రశాంతంగా ఉన్నప్పుడు, వాటినన్నిటినీ మించి హాయిని ఇచ్చే... నీకు నేనున్నాను, నీకు నేను కబుర్లు చెప్తాను, ఈ జన్మకు సరిపడా సోది చెప్తాను, నువ్వు వినాలి అన్నట్టుగా తను చెప్తూ ఉండగా, దేవుడు మనకంటూ beautiful evenings రాశాడు అనుకుంటూ మురిసిపోతూ, తనేం చెప్తుందో కూడా వినకుండా మైమరచిపోతాను. ఇప్పుడు కూడా అదే జరిగింది.
తను: "నేను ఏం చెప్తున్నానో చెప్పు?" అని తను ఆపి నా వైపు చూస్తోంది.
అరే బాబు! తన తోడు, తన మాటలకే నేను మైమరచిపోతుంటే... ఇప్పుడు ఏకంగా eye contact అవుతుంది! మా ఇద్దరికీ పెళ్ళయింది అనే విషయమే మర్చిపోయి... college days లో నేను తనకి propose చేయకముందు ఉన్న ఆ రోజుల్లోకి వెళ్ళిపోయానా అని అనిపించింది. తను సీరియస్ గా చూస్తోంది... "ఏం చెప్పానో చెప్పు!" అని. నేను తను కోపంగా ఉందనే విషయమే మర్చిపోయి, నా ఊహల్లోనే తేలుతూ తన మాట పట్టించుకోకుండా, "Thank you" అని చెప్పాను.
ఒకేసారి ఇద్దరిలో భిన్నమైన feelings... తనకేమో నా పైన కొంచెం కోపం, నాకేమో తనంటే పరవశం!
తను: "Thank you ఆ? ఏమైంది?" (తను కొంచెం slow అవ్వడం start అయింది)
నేను: నాకేమో చెప్పడానికి మాటలు రాలేదు... మాటల్లో చెప్పలేని ఆ అనుభూతులకు. తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. "చెప్పు.. ఇప్పుడు శ్రద్ధగా వింటాను" అని చెప్పాను.
తను: "నేను చెప్పను పో.." అంటూ మొహం పక్కకు తిప్పేసుకుంది. కానీ, తన చేయి ఇంకా నా చేతిలోనే ఉంది.
నేను: "ఈరోజు నువ్వు బస్సులో వస్తుంటే, సిగ్నల్ దగ్గర బస్సు కిటికీ పక్కన కూర్చున్న ఒక ఆంటీ మొబైల్ ఫోన్ పట్టుకుని ఒక అబ్బాయి పరుగెత్తడం స్టార్ట్ చేశాడు. నీకు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే involuntary గా నీ laptop bag ఆ అబ్బాయి కాళ్ళకి అడ్డం వేశావు. వాడు కింద పడిపోయాడు! చుట్టూ ఉన్నవాళ్లు వాడిని పట్టుకున్నారు. ఆ ఆంటీ ఫోన్ ఆ ఆంటీకి దక్కింది... అందరూ నిన్ను ఎంతగానో మెచ్చుకున్నారు." అని నేను చెప్తూ, తన కళ్ళలోకి ఆరాధనగా చూస్తున్నాను.
నేను విన్నానని తెలిసి తను షాక్ అవుతూ, ఎట్ ఏ టైమ్ నేను తను చెప్పిందంతా విన్నానని హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇందాక మధ్యలో pause ఇచ్చిన excitement ని మళ్ళీ రెండింతలు చేసి, ఇంకా జోష్ పెంచి చెప్పడం start చేసింది. చిన్న పిల్లలాగా ఇంకా share చేసుకోవాలి, త్వరగా చేసేసుకోవాలి అనే mood లోకి వెళ్ళిపోయింది తను..
నేను: "Great job! Nice timing... భలే సమయస్ఫూర్తి!"
తను: "నాకు చాలా బాగా అనిపించింది. ఆవిడ కూరగాయలు అమ్మి రూపాయి రూపాయి జాగ్రత్తగా దాచుకుని, ఖర్చు కూడా చూసుకుంటూ ఆ ఫోన్ కొన్నారంట!"
నేను: "చాలా మంచి పని చేశావు! సరే కానీ... ఇంత excite అవుతున్నావు అంటే దీని ఒక్కదానికే కాదు, అసలు కథ ఇంకేదో ఉంది!" అని అన్నాను.
తను నా కళ్ళలోకి చూస్తూ... గట్టిగా నవ్వేస్తూ, "నీకు ఎలా తెలుసు?!" అని పకపకా నవ్వేసింది.
అబ్బా! ఇది కదా ఆనందం అంటే... ఇది కదా ప్రశాంతత అంటే! అని లోపల అనుకుంటూ తననే అలా చూస్తున్నాను. అందరూ తనని మెచ్చుకున్నారు. తనకి సమయస్ఫూర్తి ఉందని పొగిడిన పొగడ్తలు, ఒక మంచి పని చేశాననే ఆనందం, అందరి ప్రశంసలు, తనని తాను అభినందించుకోవడం, నా కళ్ళల్లో తన పట్ల పెరిగిన గౌరవం... ఇవన్నీ కాకుండా ఇంకేదో జరిగింది! అది తన మాటల్లో నాకు స్పష్టంగా అర్థమవుతోంది. అదేంటో కూడా నేను ఊహించగలుగుతున్నాను. కానీ తన నోటి నుంచే విందామని నేను కూడా లోపల నవ్వుకుంటూ వేచి చూస్తున్నాను.
నేను: "ఏమైందో చెప్పు?" అని నేను ఆత్రుతగా అడిగాను... నా ఆత్రుతని చూసి తనకి ఇంకాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది.
తను నిదానంగా నా దగ్గరికి వచ్చింది.
తను: "ఏం లేదు... ఆ ఆంటీతో మాట్లాడుతూ, 'నువ్వు చూస్తుంటే నా చిన్న కూతురిలానే ఉన్నావమ్మా' అన్నారు. 'అవునా ఆంటీ?' అని అన్నాను... ఆ ఆంటీ ఆగకుండా 'నీ వయసే ఉంటుంది అమ్మ.. వయసు 18 ఏళ్లేనంట! అంటే నేను చూడడానికి వాళ్ళ 18 ఏళ్ల అమ్మాయిలా ఉన్నానంట! సో... నేను 18 ఏళ్ల పిల్లలా అనిపించానన్నమాట ఆంటీకి!'" అని చెప్తూ సిగ్గుపడుతూ నవ్వడం start చేసింది!
ఇది కదా ఆనందం అంటే... ఇది కదా ప్రశాంతత అంటే! అని లోపల అనుకుంటూ ఆ పిచ్చిదాన్నే అలా చూస్తూ ఉండిపోయాను. నాకు ఒక్కసారిగా లోపల ఆనందంతో నవ్వొచ్చేసింది! కానీ బయటికి నవ్వలేదు... నవ్వితే మళ్ళీ ఇంకో గొడవ! అట్లా అని ఏం చేయాలో తోచక చూస్తూ ఉండిపోయాను. ఈ పిచ్చిది... ఎంత సాదాసీదా మనిషి! అంత సమయస్ఫూర్తితో, అంత ధైర్యంగా ఒక జేబు దొంగను పట్టించి అందరితో మెచ్చుకోళ్ళు పొందితే... తాను ఒక గొప్ప పని చేశాననే గర్వం కానీ, ఆ పొగడ్తలను తలకెక్కించుకోవడం కానీ చేయకుండా... నువ్వు చాలా చిన్న వయసుదానిలా కనిపిస్తున్నావు అనే ఒక చిన్న మాటకే కొండంతగా పొంగిపోతోంది!
తన అమాయకత్వానికి ఒక పక్క ముచ్చటేస్తూనే... ఎట్ ఏ టైమ్ ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తి నా జీవితంలో ఉన్నందుకు లోపల ఎంతో ఆనందించాను. అందుకే తనకు Thank you చెప్పాను!
అలా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉండగా...
ట్రింగ్ ట్రింగ్... అని అలారం మోగింది. ఒక్కసారిగా కళ్ళు తెరిచి నిద్రలేచాను. కల! ఇదంతా... ఒక కల!
నాకు కొన్ని నెలల కింద బ్రేకప్ అయింది. ఇప్పుడు కలలోకి వచ్చింది తను కాదు. ఈమె ఎవరో నాకు తెలియదు.
ఇప్పుడు ఇది ఎందుకో రాయాలనిపించింది. రాయడం మొదలుపెట్టిన తర్వాత పేజీ చివరికి వచ్చిన తర్వాత రాయడం ఆపేసి పక్క పేజీ తిప్పాను. జీవితం కూడా అంతే. ఒక మజిలీ పూర్తయిందంటే అక్కడితో అయిపోయినట్టు కాదు. ఇంకో పేజీ తిప్పాలి.
మా అమ్మ చెప్పినట్టు "ఆఖరి ముద్దే బలం".
మా నాన్న చెప్పినట్టు "ఆఖరి mile-యే memorable".
చూద్దాం ఆఖరి mile వరకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో, ఆఖరి ముద్ద ఎంత బలమైనదో. చివరి వరకు ప్రయాణం సాగిద్దాం! మన వాళ్ళని మాత్రమే కాదు మనల్ని కూడా మనం ప్రేమిస్తూ.. ప్రేమని ఇస్తూనే..
Written by VasisTa🖊️ 🙂😃🙌
22/09/2026.. #VW
Comments
Post a Comment