Time Travel
గతంలో ఒక రోజుకి వెళ్లడమా? కాలం తిరిగి రావడమా? కాలం ఎలా తిరిగి వస్తుంది?
మనదంతా one-way journey ఏ కదా!! ఈ లైన్ చదివి బుర్రలో ఒక మూల పడేసి, "నీ పని నువ్వు చేసుకో" అన్నట్టు వదిలేశాను.
History repeats itself అని ఎప్పుడో విన్నాను.
భూకంపాలు ఎప్పుడు, ఎక్కడ పుడతాయో అంచనా వేయలేనట్టు... రోజు మధ్యలో ఈ ఐడియా తాలూకు ఆలోచనలు మెదడులో seismic waves లా అప్పుడప్పుడు కదిలిస్తున్నాయి.
సరే... ఆ రోజుకి వెళ్లాలి?
First love? Missed opportunities? చేయకూడని పనులు చేసిన రోజుకి వెళ్లి చేయకుండా ఉండటమా? నాన్నని ఎదిరించడం, అమ్మని ఆ ఒక్కరోజు కసురుకోకుండా ఉండటమా?
బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గుర్తుపెట్టుకుని రాసేసి టాప్ ర్యాంక్ కొట్టేయడమా? ఫ్రెండ్గాడికి ఆరోజు జరిగిన నష్టం జరగకుండా ఆపడమా? నాన్నతో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయించేయడమా?
బాధపడిన రోజులు గుర్తులేవు. సంతోషంగా ఉన్న రోజులు కూడా అస్సలు గుర్తులేవు.
సరే... ఈరోజు తారీఖు ఎంత? July 15, 2026. సమయం... గడియారం వైపు చూపు తిప్పుతూ సడన్‌గా కళ్లూ మూసేసుకున్నాను. ఇందాక చూస్తే 7:30 అయింది. ఇప్పుడు ఎంత సమయం అయినా నాకు అనవసరం.
ఇప్పుడు నా ప్రకారం సమయం 7:30 ఏ!!
ముందు మన బాల్యానికి వెళ్దాం...
కళ్లూ తెరుస్తూ ఉన్నాను... శరీరం దూది పింజలా తేలుతూ ఉంది... ఒక్కసారిగా జెట్ విమానం jerk తో మొదలైనట్టుగా వెనక్కి వెళ్తున్నాను.
కొంచెం సేపటికి చుట్టూ పొగ... సిగరెట్ smoke... నేను ఇన్ని ఏళ్లుగా తాగుతూ పీల్చిన నల్లని పొగ నెమ్మదిగా నా నుంచి బయటకు వెళ్లిపోతోంది. నేను కాలంలో వెనక్కి జారుతుండగా...
Show reels లాగా నేను నా అనుకున్న వాళ్లతో, గొడవలు పెట్టుకున్న వాళ్లతో arguments అన్నీ వేగంగా కదులుతున్నాయి నాకు రెండు వైపులా...
ఆ film screens మధ్యన నేను వేగంగా జారిపోతుండగా... వేగం పెరుగుతుండగా నాకు భయం వేయడం మొదలైంది. నా పొట్ట భాగంలో నాకు ఏదో అడ్డు తగలడం తెలుస్తోంది. బొడ్డు పేగు.
Past లో వెళ్తున్నప్పుడు నాకు నేటి కాలానికి సంబంధం ఇలా నిలబడిందా?
సిగరెట్ పొగలో ప్రయాణం చిరాకుగా, suffocating గా ఉంది. ఎప్పుడు మొదలుపెట్టానా అని గుర్తు చేసుకుంటే 17th year అని గుర్తొచ్చింది.
ఇప్పుడు వెనక్కి వెళ్తూ 21st year లో ఉన్నాను. Realise అయ్యేలోపు... ప్రేమలో ఉన్నాను.
ఒక్కసారిగా వర్షం మొదలైంది... చెంపదెబ్బ ఫెళ్లుమని వినిపించింది...
ఒక్కసారిగా చీకటి అయిపోయింది... ఏం కనిపించడం లేదు నాకు. ప్రేమలో ఉంటే ప్రపంచం కనిపించదు కదా!!
Memories కనిపించట్లేదు ఏంటి నాకు?
ముందు కురిసిన వర్షమే నా heartbreak తాలూకా కన్నీళ్లు అని గుర్తొచ్చి నవ్వొచ్చింది.
19-21 మొత్తం blank ఏ అయిపోయింది. 18లో cricket matches, street fights అన్నీ సిగరెట్ పొగలో కదులుతున్నాయి...
ఈ సిగరెట్ పొగ ఎప్పుడెప్పుడు పోతుందిరా బాబు అని నాకే విసుగు వచ్చేలా ఉంది!!
Present లో నేను ఏం కోల్పోతున్నానో అర్థమవుతుంది మెల్లగా.
వచ్చేశాం... 17 దాటేశాం. సిగరెట్ పొగ పోయింది. ప్రయాణం joyful గా, ప్రశాంతంగా ఉంది.
నా బాల్యానికి వెళ్లాను. నా 10th year... My birthday.
ఆరోజు నేను ఏం చేశానో అని నేనే ఎదురు చూస్తున్నాను. Memorable అని గుర్తుంది కానీ... ఏం జరిగిందో మర్చిపోయాను.
అన్నయ్య hostel లో ఉండటం వల్ల ఇంట్లో లేడు ఆ రోజు. అమ్మమ్మ, తాతయ్య cycle గిఫ్ట్‌గా తెచ్చారు. చూసి shock అయిపోయాను. ఆనందంతో మాటలు రాక... తట్టుకోలేక... కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగి... అమ్మని పట్టుకుని ఏడ్చేశాను.
నాకు cycle రాదు. ఆ రోజు అమ్మ నన్ను వెనక కూర్చోబెట్టుకుని కాలనీ అంతా రౌండ్లు వేసింది.
మా అమ్మ నాకు ఒక హీరోయిన్లా అనిపించింది. తను నవ్వుతుంటే నాకు ఎంతో ఆనందంగా అనిపించింది.
ఒక్క ఉదుటున...Let's go to the present అనుకున్నాను...
Back to July 15, 2026.
నా దృష్టిలో సమయం 7:30 కాబట్టి... నేను present కి వచ్చిన 5 mins కి... నేను కోరుకున్న మరొక రోజుకి వెళ్లే అవకాశం మళ్లీ వచ్చింది.
ఈసారి ప్రేమలోకాల అంచులకి...18-19 age అది.
Shirt పై button తీసేసి నాన్న పాత Chetak పైన... తనని follow అవుతున్నాను ఆరోజు.
తనకి ఇద్దామని తీసుకున్న Dairy Milk Celebrations చాక్లెట్ జేబులోనే ఉంది.
మనసు మనసులో లేదు. ఆలోచన మెదడు దాటి కళ్లను కమ్మేసి, శరీరం అచేతనంగా పది నిమిషాల ముందు జరిగిన అనుభూతిలో చిత్తు చిత్తు అయిపోతుంది.
We kissed each other. First kiss.
I don't know why... I didn't relive that exact kiss moment. ఆ అనుభూతులు చాలు. కాబట్టి ఆ kiss ని మళ్లీ create చేయలేదు.
Because she's committed and married to someone else now.
నేను ఒక పిచ్చోడిని.
మళ్లీ present లోకి వచ్చేశాను.
July 15, 2026. 7:30.
ఈసారి ఇంకొక మజిలీ...నేను... అన్నయ్య...
అంతా వెనక్కి పరిగెడుతున్న నా కలలో... మేమిద్దరమే ముందుకి నడుస్తున్నాము.గతం అనే station లో నేను రైలు దిగేశాను అన్నమాట!!
చుట్టూ అంతా వేగంగా వెనక్కి నడుస్తున్న తరుణంలో మేము మాత్రమే ముందుకి ఎలా నడుస్తున్నాం?
ఓ... నేను, అన్నయ్య ఆరోజు ఆ సమయానికి అడుగులు వెనక్కి పడుతూ వెనక్కి నడుస్తున్నాం!! Why? ఎందుకు?
అలా ముందుకి వెళ్తూ అమ్మ, నాన్న ఆఖరుగా కలిసి ఉన్నప్పుడు వాళ్లని one last time గుండెలకి హత్తుకున్నాం. ఆ రోజే వాళ్లు విడిపోయారు.మేము court బయట ఉన్నాం. పరిస్థితులకు ఎదురుగా వెళ్లాలి అన్నట్టుగా... ఇందాక నేను, అన్నయ్య లోకానికి ఎదురుగా వెళ్లాం అనిపించింది.
మళ్లీ present లోకి వచ్చేశాను.
July 15, 2026. 7:30.
గుండె బరువెక్కింది...కలలో మేము ముందుకి నడిచింది మెదడు పొరల్లో రెపరెపలాడుతోంది.
ఎదురుగా అమ్మ... తను ఇన్ని రోజులు happy గా ఉందా అని ఆలోచన వచ్చింది. Future లో?
నా ఈ కల వెనక్కి మాత్రమే వెళ్తుందా? Future లో ఒక రోజుకి వెళ్లొచ్చా? అనే thought వచ్చింది. Let's go to the future. తను happy గా ఉందా అని చూడాలి అనిపించింది.
ఆలోచన అయితే వచ్చింది కానీ ధైర్యం రాలేదు. నేను ప్రతిరోజూ ఏ భవిష్యత్తు అయితే ఆశాజనకంగా, సుఖంగా ఉంటుందని నాకు నేను ధైర్యం ఇచ్చుకుంటానో... ఆ భవిష్యత్తుకి వెళ్లడానికే భయమేసింది.
అప్పుడే ఒక అశరీరవాణి... దిక్కులు పిక్కటిల్లేలా... ఆకాశాన్ని చీల్చుకుంటూ...
నేను వెళ్లిన ప్రతి రోజుని మళ్లీ జీవించేలా చూపించింది.
Now I can feel those days again. I'm not reliving the past. I'm present in the past. వర్తమానం.
ప్రతి రోజు చేసేదే ఆ రోజు చేశాను. ఆ రోజు ఏం చేయాలో అదే చేశాను.
Youth కి వెళ్లాను. ఆ రోజు ఏం చేశానో అదే చేశాను.
College కి వెళ్లాను. ఆ రోజు ఏం చేశానో అదే చేశాను.
Past లో పది రోజులకి వెళ్లినా... అది past కాదు. ఆ రోజుకి అది present ఏ.
Future లోకి ఇంకో పది సార్లు వెళ్లినా I've to live that day.
ఈరోజుకి అది relatively past/future అవుతుంది కానీ...ఆ రోజుకి అది present ఏ. ఆ రోజు జీవించాల్సిందే.
గతానికి వెళ్లినా కాలం ముందుకే సాగుతుంది. భవిష్యత్తుకి వెళ్లినా అదే తీరు. అవకాశం ఉంది కాబట్టి ముందు, వెనక్కి వెళ్లడానికి.
So, if I were given the chance to relive a day, I would choose today. And I would choose it every day.
Thanks for reading...
Written by VasisTa 🖊️
15/07/2026, #VW
Comments
Post a Comment