Co - God
Dedicating this special one to my friend and guru Teja...
అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా! చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా!! తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ!! తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ!!
హరివిల్లు రంగుల్లో వర్ణాలే అని పాటతో పాటు కూనీ రాగంతీస్తూ చిలికిన చిలకవు ఉలకవు పలకవు అంటూ పువ్వుని మెదిపితేనే గాయపడిపోతాయేమో!! అనేట్టు ఉండే తనవేళ్ళతో నన్ను గిచ్చింది.
తన పచ్చదనాన్ని తనే ఒంపేసుకునే చెట్టులా తన ఒడి మైకంలోనున్న నన్ను ఒక్కసారిగా తనే బయటకి తెచ్చింది. చురుక్కుమంది!! బండ శరీరానికి నొప్పైతే కలగలేదు కానీ మధ్యలో తనని చూడాలనిపించి కళ్ళు తెరిచాను. తను కనిపించలేదు! పోయి స్వర్గానికేమైనా వచ్చానా!! అన్నట్టు మొత్తం తెల్లని పొగ మంచులా ఉంది! అదే మాట బయటకి అనేసాను.. నవ్వుతూ ముందుకు వాలింది. అప్పుడు అర్ధమయ్యింది నేను తన ఒడిలో తల వాల్చుకుని ఉన్నప్పుడు నా మొహంపైన తను తన తెల్ల చున్నినీ పరిచింది అని. త్రివర్ణ పతాకం కప్పించుకుందామని అనుకుంటుంటే నువ్వు తెల్ల పరదా కప్పేసావా? అని ఆమె కళ్ళని గమనిస్తూ అన్నాను!! ఏ మాత్రం భయపడకుండా అవును కదా!! అంతకన్నా ఇంకేం కావాలి!! అని అంది. ముచ్చట కలిగి నవ్వేసాను.
సరే!! ఇంక వెళ్ళాలి. గుడికి ఆలస్యమవుతుంది అని అంది.. అప్పుడేనా! నేను చెప్పాలనుకునంది ఇంకా చెప్పనేలేదు కదా!! అనుకున్నాను. చెప్తే ఎలా తీసుకుంటుందో!! అని ఆలోచన. గుడికి వెళ్ళాలి. న్ న్ న్ న్ వ్ వ్ వ్ వ్ అన్ అన్ అన్ అన్ ట్ ట్ ట్ ట్ ఏ ఏ ఏ మళ్ళీ క్షణంలో లక్షోవంతులో మెదడులో నువ్వంటే (నాకిష్టం అని చెప్పబోతుందేమో అన్న ఆలోచన) నాస్తికుడివి, గుడా, గోపురమా!! ఇంక వెళదాం పదా!
నేను ఏం నాస్తికుడిని కానే!! దేవుడిని నమ్ముతాను, కానీ నేనే ఆ దేవుడిని అని నమ్ముతాను. తప్పు అలా అనకు అని తన చేత్తో నా నోరు మూసే ప్రయత్నం చేసింది.
నేను: ఆ ప్రయత్నమేదో పెదవులతో చేయోచ్చు కదా!!
తను: ఇంకెప్పుడు దేవుడి గురించి అలా మాట్లాడకు.
నేను: ఏ నీకు నచ్చదా?
తను: కాదు. అయినా ఎందుకు అలా?
నేను: ఏ దేవుడికి కోపం వస్తుందనా? అయినా దేవుడు మనుషుల్లాగా ఇగోయిస్టా ఏంటి? జీవుల్లాగా కుంచిత స్వభావం ఉండదు పరమాత్మకి! అంటే నాకు!
తనకి వెళ్ళాలనిపించట్లేదు. నీకెప్పుడు తెలిసింది నువ్వు దేవుడివని? అని కూర్చుంటూ కొంటెగా అడిగింది. తన చేతిని నా చేతుల్లోకి తీసుకుని అలా చెప్పడం మొదలుపెట్టాను.. అది మే నెల. పని ముగించుకుని అలా గదిలో పడుకుని అలోచిస్తున్నాను. కొంతసేపటి తర్వాత ఎక్కడనుండో ఏదో శబ్దం వినిపిస్తుంది. అది ఎవరిదో గొంతు. తెలిసీతెలియనట్టు ఉంది. ఆడో మగో అర్ధంకాలేదు. కళ్ళు తెరిచే ప్రయత్నం చేసాను. కానీ నా వల్ల కాలేదు. అశరీరవాణి అని అర్ధమయ్యింది.చెయ్యి ఆడించి చూసాను. ఎవరిదో శరీరం చేతికి తగిలింది. చల్లగా లేదు, వేడిగానూ లేదు. నేను దేవుడిని అని వినిపించింది. ఎవరా? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామని తల నిమిరాను. ముళ్ళ కిరీటం లేదు, అంటే యేసు కాదు. మెడ తడిమాను. నాగుపాము లేదు, అంటే శివుడు కాదన్నమాట! రూపం ఉంది కాబట్టి అల్లాహ్ కాదు. ఇంకా కిందకి వెళ్దామంటే దేవత అయ్యుండచ్చేమో అని సభ్యత అడ్డొచ్చింది. నా ముఖం తడిమి చూసుకున్నాను మీసం, గెడ్డం ఉంది. అవి లేకుంటే తల్లి పాల కోసం ఏడ్చే చిన్న పాపడునని భావించి వెళ్ళేవాడిని. నాలుగు చేతుల్లేవు విష్ణూ అంతకన్నా కాదు! ముడి, జడా లేవు. అంటే బుద్ధుడు కాదు, దేవత కాదు.
మరి ఎవరు? చూడాలని ఉందా? అని వినిపించింది. అవును అని మనసులో అనుకోగానే ఏదో కుదుపుకి లోనయ్యి ఒక్క ఉదుటున లేచాను. ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ వేసంకాలం నడిరేయి ఆకాశంలో ఒక్క పెద్ద ఉరుముతాలూకా మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ముందున్న అద్దంలో నన్ను నేను చూసుకున్నాను. ఏం జరుగుతుందో అర్ధంకావడం లేదు. అలా తదేకంగా చూస్తున్నాను. ఒళ్ళు గగుర్పోడిచేలా ఆ మెరుపు తాలూకు ఉరుము భయానక శబ్ధం చేసింది. Light travels faster than sound!! ధ్వని కన్నా కాంతి వేగంగా ప్రవహిస్తుంది కదా!! మెరుపు చూపిస్తే ధ్వని అర్ధమయ్యేలా చేసింది. అప్పటి నుండి నేను దేవుణ్ణి అని అనుకుంటున్నాను అని ముగించాను.
తెలియకుండానే మాటల్లో మళ్ళీ తన ఒడిలోకి వెళ్లిపోయాను. ఈసారి ఇద్దరి మధ్యన తెరలు లేవు. అలా నన్నే సీరియస్ గా చూస్తుంది. ఏం చెప్పాలనుకుంటున్నావు? అని అడిగింది. తనకి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. అర్ధమైపోతుంది. తన ఒడిలో పడుకుని తన కళ్ళల్లో చూస్తూ ఇంక చాలు.. విడిపోదామా? ఎవరు దారులు వాళ్ళు చూసుకుందాం! అని చెప్పడానికి ఆలోచించాను. తనే అడిగింది. నువ్వు ఇదే మాట్లాడాలి అనుకుంటున్నావా అని! తెలివితేటలకి ముచ్చటేసింది. కానీ వ్యక్తపరిస్తే అగౌరవపరిచినట్టు ఉంటది అని చెప్పలేదు. కాదు!! అని అబద్దం చెప్పాను! దేవుళ్ళు అబద్ధం చెప్పరు అని తను అంటుందేమో అనుకున్నాను. అలా అనలేదు. ధీర్ఘంగా శ్వాస తీసుకుని ఇంక వెళ్తాను గుడికి ఆలస్యమవుతుంది అని లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందో తనకీ,నాకూ ఇద్దరికీ అర్ధమవ్వలేదని అర్ధమయ్యింది. వెళ్ళిపోతూ ఆగి వెనక్కితిరిగి ఇంకెప్పుడూ అక్కడకిరా, ఇక్కడకిరా, నీ దగ్గరకిరా అని పిలవకు. దేవుడివి కదా!! దేవుడు తన దగ్గరికి రమ్మని పిలవడం అంటే మరణమే అని నేను నమ్ముతాను! అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది.
**END**END**END**END**END**END**END**END
కొన్ని సంవత్సరాల తర్వాత... ఆరోజుని మళ్ళీ గుర్తుచేసుకున్నాను.
ఆ మాట అని తను వెళ్ళిపోతుంటే ఒక క్షణం పాటు నోటి మాట పడిపోయింది. కానీ ఆ మాట వినగానే విపరీతంగా నచ్చేసింది తను. పిచ్చిపట్టిన వాడిలాగా గట్టిగట్టిగా నవ్వేసాను.. నాకు భాగస్వామిగా పూజారి వద్దు, Co-God కావాలి. తను అలాంటిదే. తర్వాత కొన్ని నెలలపాటు ఎక్కువగా ఆలోచించకూడడని బాగా ఆలోచించి, నానా కష్టాలు పడి బ్రతిమలాడి,బుజ్జగించి, ఛీ కొట్టించుకుని, మళ్ళీ తుడుచుకుని, మళ్ళీ ప్రయత్నించి, మళ్ళీ బ్రతిమలాడి, బుజ్జగించి అలా చేయగా చేయగా కరుణించి పెళ్ళికి ఒప్పుకుంది.
THE END......
ధన్యవాదములు
వశిష్ఠ ✍️
మీ దేవుడి ఆలోచన బావుంది.మీకు మంచి భావుకత ఉంది.. మంచి కథకుడిగా భవిష్యత్తు ఉంది.. బాగా చదవండి..అది మీ ఆలోచనలకు అందమైన రెక్కలు తొడుగుతుంది
ReplyDeleteAll the best
చాలా సంతోషంగా ఉంది రాంబాబు గారు. ఒకింత భయం కూడా వేస్తుంది. మీ మాటలు ఆనందదాయకంగాను, స్ఫూర్తిదాయకంగాను ఉన్నాయి. మీరు చెప్పినది తప్పకుండా పాటిస్తాను. ధన్యవాదములు అండీ!!
Deleteదేవుడు ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చాలా బాగుంది.
ReplyDeleteదేవుడు తన దగ్గరకి రమ్మని పిలవడమంటే మరణంతో సమానం ఈ మాట చాలా సహజంగా ఉంది.
చివరకి ప్రేమకోసం దేవుడు దిగివచ్చాడు. 👌
Thanks alot Satish garu. రాసేటప్పుడు అనిపించలేదు కానీ, I liked "చివరకి ప్రేమకోసం దేవుడు దిగివచ్చాడు". But context was different though 😃. Once again thanks alot🙏 - vasisTa
Delete