ముఖ్యపాత్రలో శ్రీదేవి - Episode 4

క్రాంతి పది సెకండ్స్ టైం పెట్టుకున్నాడు.

రాజకుమార్ గురించి అసలేం తెలుసు అని ఆలోచించాడు..

ఇల్లు,ఆఫీస్ అడ్రస్ తెలుసు..ఇంకా? 

ఏ టైం కి వెళ్ళి ఏ టైం కి వస్తాడో తెలుసు..

ఇంకా? పేరు తెలుసు..ఇంకా? ఎత్తు, రంగు, కార్ నెంబర్..ఇంకా? టైం అప్.. ఇంక ఏం తెలియకపోయిన పర్లేదు..చంపేయచ్చు..వాడి టైం అయిపోయింది. జీరో బడ్జెట్ కిల్లింగ్స్ కి స్వాగతం.

ఒకసారి షీట్ లాంటిది దొరికింది.ఎవరో రద్దు చేసిన 500,1000 రూపాయలని లామినేట్ చేయించుకుని పడేసుకున్నాడు. షీట్ అంచులు పదునుగా ఉన్నాయి. కష్టమైనా నిమిషంలోపు చంపేయచ్చు. డబ్బు నోటు చేతిలో చస్తున్నాడు..బహుశా పెద్దగా ఫీల్ అవ్వడేమో.. అని నవ్వుకున్నాడు.ఒకసారి ఆ షీట్ ని చూసాడు.ఏం జరగబోతుందో తెలియని గాంధీ హాయిగా నవ్వుతున్నాడు. తెలిసినా తనకి కొత్త కాదు కదా!!

తర్వాత ఏం చేయాలో బాగా ఆలోచించాడు..దొరకకపోవచ్చు. బిర్యాని తెచ్చుకుని తిన్నాడు. ఎందుకో తెలీదు ఏదో తెలియని సంతోషం నిండిపోయింది. అలా నిద్రలో జారుకున్నాడు... ఇలా కంటిముందు కదలాడుతుంది...


తర్వాత రోజు సాయంకాలం. సమయం 5:00 P.M. స్థలం: రాజకుమార్ వాళ్ళ ఉరి శ్మశానం.

రాజకుమార్ చనిపోయాడు.చాలా మంది వచ్చారు. తమ్ముడనుకుంటా తెగ ఏడుస్తున్నాడు. కార్యం చేస్తున్నాడు. కాటికాపరి అప్పటికే ముగ్గు వేశాడు. కట్టెలు పేరుస్తున్నారు. దాదాపు ఐపోయింది. దేహాన్ని బోర్లా తిప్పి చితిని ఎక్కించారు. చీకట్లో చితి వెలిగింది

.

అదే రోజు ఉదయం..సమయం 09:30 A.M. రాజకుమార్ ఇల్లు.

షామియానా టెంట్ వేస్తున్నాడు కుర్రోడు. జనం నెమ్మది నెమ్మదిగా గుమిగూడుతున్నారు. క్రాంతి అలానే చూస్తున్నాడు. లోపల నుండి పెద్దగా ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆంబులెన్స్ వచ్చి ఆగింది. క్రాంతికి కూడా ఒక్కసారిగ ఒళ్ళు జలదరించింది. లోపలి నుండి రాజకుమార్ దేహాన్ని దించారు. ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి.


అదే రోజు ఉదయం..సమయం 05:30 A.M.

క్రాంతి బయలుదేరాడు.. రాజకుమార్ ఒక్కడే వాకింగ్ కి వస్తాడు. పల్లెటూరు కదా..చీకట్లో చంపేయచ్చు. ఒక్కసారిగా కార్ హారన్ మోతకి క్రాంతి ఒక్కసారిగా నిద్ర లేచాడు. జరిగేదంత కలలో కనిపించింది.

రాజకుమార్ చావడం కలే అవుతుందా?


 ఒక్కసారిగా శూన్యం కమ్మేసినట్టు అనిపించింది. సమయం నాలుగు అయ్యుంటుంది. అలానే నడుస్తూ వెళుతున్నాడు. నీరసం నిస్పృహ అల్లేశాయి. చంపగలనా? అనిపించింది. చంపేస్తాను నుండి చంపగలనా? వరకు పదిపొయింది ధైర్యం.దానిదేముందిలే చంపితే మళ్ళీ టాంక్ ఫుల్ అవుతుంది అనుకున్నాడు. తెల్లవారఝామున అవడం వలన అన్ని ఊర్ల నుండి బస్సులు వస్తున్నాయి. రోడ్డు మీద నుండి ఊరు 3 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది. అక్కడే రోడ్డు మీద ఆగాడు. 

వచ్చే పోయే వాహనాలని చూస్తున్నాడు. ఈలోపు బస్ ఆగింది. ఒక వృద్ధ జంట దిగింది. వాళ్ళనే చూస్తున్నాడు. లగేజ్ కొంచెమే ఉంది. ఈలోపు ఒక కార్ వచ్చి వాళ్ళ ముందు ఆగింది. కార్ నుండి ఒకతను దిగాడు. అతను రాజకుమార్. దిగుతూనే అమ్మా అని ఆవిడని హత్తుకున్నాడు. తరువాత నాన్న అని ఆశీస్సులు తీసుకున్నాడు. క్రాంతికి కనపడుతున్నాయి.కానీ ఇంక ఏం వినిపించట్లేదు. అదేంటి రాజకుమార్ అమ్మానాన్న ఇంకా బ్రతికే ఉన్నారా? ఏదో తెలియని బరువు తనని తొక్కేస్తున్న ఫీలింగ్.


ఒక్కసారిగా వైజాగ్ లో జరిగినది కళ్ల ముందు మెదులుతుంది. తనని తీసుకువెళ్లడానికి వాళ్ల పెదనాన్న కొడుకు వచ్చాడు. ఒక విషయం కూడా చెప్పాడు. క్రాంతి వాళ్ల ఊరు రావడం ఎవరికి ఇష్టం లేదంట!! ఎందుకంటే... క్రాంతి జాతకంలో తన కన్న వాళ్ళని చంపుతాడు అని ఉంది.అది తెలిసి అతని తల్లిదండ్రులు అతన్ని దూరంగా పంపించేసారు. తరువాత బెజవాడ వచ్చి ఇక్కడ అనుకోని పరిస్థుతుల వల్ల తన తోబుట్టువులని తనే చంపుకున్నాడు. ఈ వయస్సులో వాళ్ళకి శోకం మిగ్చదలుచుకోలేదు..అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగాడు? బానే ఉన్నారు..వాళ్ళకి కూడా తనని చూడాలని ఉంది.. నమ్మకాన్ని విడిచి నిన్ను చుడటానికి ప్రయాణమైన నాన్నకి కరెంట్ షాక్ కొట్టింది. నిన్ను చూడటానికి వస్తేనే అపశకునం జరిగింది.ఇంక నువ్వు వచ్చి వాళ్ళతో ఉంటే చావు తధ్యం అని జోతిష్యుడు చెప్పాడు. నీకు చిల్లి గవ్వ కానీ,నిలువ నీడ భూమి కూడా ఇవ్వద్దన్నాడు. ఆ డబ్బుతో నువ్వు నీవాళ్లని వెతుక్కుంటూ వచ్చి చంపుతావు అని చెప్పాడు. అందుకే క్రాంతి ఎప్పుడూ డబ్బులు అడుక్కోలేదు. ఎక్కడ పోగు చేసి ఊరు వెళ్లిపోతానో అని భయం. మిధున ఇచ్చిన దానితోనే తినేవాడు. తల్లితండ్రులకి దూరంగా బతకడం నరకమనిపించింది.తన వల్ల తన తల్లిదండ్రులకి ఏం కాకూడదు అని భాదని దిగమింగుకుని బతుకుతున్నాడు.లేదు తను చంపలేడు..తన వల్ల కాదు. రాజకుమార్ కి యాభై యేళ్ళు ఉంటాయి..అతని తల్లిదండ్రులు బ్రతికి ఉండకపోవచ్చు అనుకున్నాడు క్రాంతి.ఎప్పుడూ వాళ్లు ఉన్న ఆనవాలు కూడా తెలియలేదు.అంటే వాళ్ళు వేరే చోటు ఉంటారన్నమాట. లేదు..లేదు..లేదు..లేదు..తను చంపలేడు.. ఏ తల్లీదండ్రీ కూడా తమ కన్నా తమ పిల్లలు ముందు చనిపోవడాన్ని అస్సలు ఊహించరు..వాళ్లు భరించలేరు,తట్టుకోలేరు. తన అమ్మానాన్న లానే అనిపించారు వీళ్లు కూడా...వీళ్ళకి శోకం మిగల్చకూడదు. అంటే ఇప్పుడు చంపకూడదు.. లేదు చంపట్లేదు...చంపట్లేదు... 

వాళ్ళని ఎక్కించుకుని కార్ వెళ్ళిపోయింది. 


ఒకసారి ఒక రచయిత ఇలా చెప్పాడు...

"Murders and deaths doesn't cost a penny...it costs feelings,love and emotions, burns people alive."


 అలా ప్రాణం పోసిన అమ్మానాన్నే రాజకుమార్ కి ప్రాణ భిక్ష పెట్టారు. బరువైన హృదయంతో క్రాంతి ఆలోచనల అడవిలో తిరుగుతున్నాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. కార్ యాక్సిడెంట్ అయినట్టుంది. కంగారుగా అటు వైపు పరిగెత్తాడు. రాజకుమార్ వాళ్ళ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. లోపల నుండి వేగంగా వస్తున్న లారీ గుద్దేసింది. ఒక్క ఉదుటున వెళ్లాడు. అమ్మానాన్నకి ఏమై ఉంటుందా అనే భయం కమ్మేసింది. పక్కన ఉన్న హోటల్ నుండి జనం పరుగుపరుగున వచ్చారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. రాజకుమార్ నెత్తుటి మడుగులో ఉన్నాడు. అదృష్టవశాత్తు నాన్నగారికి ఎయిర్ బాగ్ తెరుచుకుంది.కానీ స్పృహలో లేరు..అమ్మ వెనుక కూర్చోవడం వల్ల భయంకరంగ తగల్లేదు కానీ స్పృహలో మాత్రం లేదు..ఆంబులెన్స్ వచ్చింది..ముగ్గురినీ తీసుకువెళ్ళింది. ఆ కారు ముందే కూర్చుని చూస్తున్నాడు క్రాంతి. 


సమయం అదే రోజు ఉదయం.. 09:30 A.M.

తనకి ముందు రోజు కలలోకి వచ్చిందే నిజం అయ్యింది. అమ్మానాన్నకి ప్రాణభయం లేదు అన్నారు. అంత్యక్రియలు చూడలేకపోయాడు క్రాంతి. ఏదో తెలియని భాద తొలిచేస్తుంది.తను చేయకపోయినా తనకి కావాల్సిన పని జరిగిపోయింది. రాజకుమార్ చావడం. కానీ ఆనందంగా లేడు. ఉండడు కూడా!!ఎందుకంటే రాజకుమార్ కూతురే మిధున కాబట్టి.



Murders and deaths doesn't cost a penny...it costs feelings,love and emotions, burns people alive. There may be Zero Budget killings but not Emotionless killings. 


కాబట్టి ముఖ్యపాత్రలో శ్రీదేవి కాదు.


THE END...


P.S. పైన ఇంగ్లీష్ లో ఉన్న సారాంసాన్ని చెప్పిన రచయితని నేనే..

కథ పూర్తైతేనే రచయిత అయ్యినట్టు కదా!! అందుకే ఈ విషయం కథ పూర్తయ్యాక చెబుతున్నాను.



Comments

Popular Posts