వశిష్ఠుని ఆశాజీవి

బ్రహ్మ పాళినై నాతో నేనాడెను వైకుంఠపాళి...నేనే రాహువై నన్నే మింగివేయగా...చీకటని నిందించినదీ నేనే..

నే చేసిన తప్పుల చితి యెదన రగులుతుండగా చలి మంటే కాచుకున్నాను..

ఓపికలేనోడికి కాలం నిమ్మళించదా?

సత్తువంటూ లేనివాడే లేడే..అయినా ఈ రోదన యేలా??

అమవాసకి దగ్గరైకొద్దీ కాదది కృష్ణ పక్షం...ఎల్లప్పుడూ కష్టాల పక్షం..కష్టాలే నా పక్షం...

ఆశనే శ్వాసగా తీసుకుని గడియ గడియ పెంచుకుంటున్నా నా కష్టాల జీవిత కాలం..


చివరాఖరికి చక్కెర చేదు తెలిసింది...


నే విడుస్తున్నా నా మనసుకి పట్టిన కుబుసం...

పోతుంది నాకు అంటిన గ్రహణం.

కష్టాలని, రోగాలని, రుగ్మతలని, వ్యసనాలని నా నుండి పంపుతూ నే పడుతున్నా ఈ ప్రసవ వేదన...

వర్షాకాలం కల్లాపి చల్లగా,శిశిరకాలం ఆకు రాల్చగా మోడైమారిన మనిషి వసంత కాలానా జీవియై పుట్టడా!!

నే గిట్టి పుట్టాను.. గెలిచేందుకు పుట్టాను..

వస్తుంది నాకూ ఒక ఉదయం...

నేడు బ్రతికేది రేపు చావడానికి కాదు... చావే లేకుండా బ్రతకడానికి....

వస్తుంది నాకూ ఒక ఉదయం...నాకూ వస్తుంది ఒక ఉదయం...


శతకోటి ఆశాజీవులకి ఈ వశిష్ఠుని ఆశాజీవి అంకితం...


వశిష్ఠ (వంశీ కృష్ణ బాజారు)







Comments

  1. నచ్చింది బ్రో.
    నే గిట్టి పుట్టాను.. గెలిచేందుకు పుట్టాను.
    ఇన్స్పిరేషనల్.

    ReplyDelete

Post a Comment

Popular Posts