R-Day
రాజ్యాంగానికి తెలియదే కులం, మతం. ఏకంగా రాజ్యాంగనిర్మాతకే కులం అంటించగలం...
వేర్పాటువాదానికి,ఉగ్రవాదానికి ఒక మతమేనా కారణం? కాదా కొందరు హైందవ 'జిన్నా'లెందరో కారణం!!
నదులపై ఆనకట్టలు కట్టగలిగాము. అభాగ్యుని కన్నీటి సుడులకి అడ్డుకట్ట ఎప్పటికి వేయగలము??
నీకేంటి లాభం..నాకేంటి లాభం...మధ్యలో వృధాగా పోయింది ఆజాద్, భగత్ సింగ్ ల త్యాగం..
కాల్చరా అని ఆంధ్ర కేసరి గుండె చూపలేదా?? నేటి యువత వెన్ను చూపడం లేదా!!
బోర్లు వేసేదీ నీళ్ళు పడటానికే కాదు...పసి పిల్లలు పడటానికి..
నా దేశంలో పాలు ఇచ్చు పశువులెన్నో, గొడవలిచ్చు గోవులు ఇంకెన్నో!!
అన్ని ఉన్నా పాలు,పౌష్టికాహారం అందని పసికందులు ఎన్నో!!ఎన్నెన్నో!!!
వినాశనమైనా, విజ్ఞానమైనా ఒక మతమేనా కారణం??మనిషే కదా మూలం!!
'నాకెందుకులే' అని అనుకున్నావా? ఒకరోజు 'నాకే ఎందుకు ఇలా' అని సమాధానపడతావు.
వద్దనున్నది వేదనలేనా!!
నెలసరొచ్చిన ఆడపిల్లకే కాదు నెలలు నిండని పసి గుడ్డుకే రక్షణ లేదు.
నెలసరిన రక్తపు మరకలు.. దినసరిన రేపుల భయాలు...
కాషాయం కట్టినోడు శత్రువంటే అల్లూరి పోరాడింది ఎవరి కోసం??
అమరవీరులకి గెలుపోటములు తెలియవు..త్యాగాలు తప్ప!!
సాధించింది కూసంత... కూసేది కొండంత...
వెన్ను వంగినా సాలుమరద తిమ్మక్క ఒళ్లు వంచలేదా!! ఆమె నాటిన విత్తు భువిని చీల్చలేదా!! నీడనివ్వలేదా లేక స్ఫూర్తి నింపలేదా!!
చితికిన కర్షకుని డొక్క దున్నినా ఏం దొరుకుతుంది ఆశ తప్ప!!
బలవంతపు చట్టాల చక్రపుటిరుసులలో పడి చచ్చెను బలహీనులెందరో!!
ఇలా రాసి రాసి విసుగొస్తుంది...బాదొస్తుంది..ఏడుపొస్తుంది..కానీ ఆశ మాత్రం చావట్లేదు.
ఆ ఆశ ఏంటంటే!!
లూటీలు,దొమ్మీలు,అక్రమార్జనలు చేసేవాడి, చేసినవాడి నెత్తిన రాజ్యాంగం పడి తల పగిలి నెత్తురు కక్కుకు చచ్చే రోజు రాకపోదా!! అని ఆశతో...
సాధించింది కూసంత... కూసేది కొండంత...
సాధించింది కూసంత... సలపాల్సినది సమరమంత!!
వశిష్ఠ(వంశీ కృష్ణ బాజారు)
Simply superb
ReplyDeleteThanks bro 😊
Delete