పిచ్చివాళ్ళ ప్రేమలేఖ
చదువంటే ఆసక్తిలేని విద్యార్థి ఓటరు.. ఆ విద్యార్థికి గొప్పగా చదువు చెబుతున్నట్టు నటిస్తున్న టీచరు పొలిటీషియన్. ఇదే మన ప్రజాస్వామ్యపు పాఠశాల. వాడు పాసవ్వడు..వీడు బాగూచేయడు.
మనం నిర్ణయించేది ఒకడి గెలుపోటములే కాదు..మన భవిష్యత్తుని, బతుకులని..
చావింట్లో శవం ముందు నవ్వే ఇంగితంలేనోడి నవ్వు.. ఫలితాల రోజు అవినీతిపరుడిని గెలిపించినవాడి నవ్వూ ఒకటే.. ఇద్దరం నవ్వుతున్నాం..వాడు ఆనందంతో..నేను వాణ్ణి చూసి బాధతో..
కాలం ముందుకు వెళ్తుందని ఎవరన్నారు?? మనల్ని పాతాళంలోకి తొక్కుతూ పైకి వెళ్తుంది.
చిన్న చేపని పెద్ద చేప మింగినట్టు అత్యాశ కులపు చిన్నోడిని పెద్దోడు మింగేస్తున్నాడు, మింగుతాడు.
అవసరానికి డబ్బు దొరకని కొందరు..అవసరానికి మించి ఒంటికి డబ్బు పట్టిన మరికొందరు.
మనుషుల మనస్తత్వాలు నాటితే రాజకీయ జనులు పెంచిపోషించిన మహా వృక్షమే "విభజించు-పాలించు". ఇప్పుడా వృక్షమే విషపు ఫలాలనిస్తుంది.
తల్లి నుండి జరిగే విభజన మనిషికి పుట్టుకైతే..మనుషుల మధ్య జరిగే విభజన సమాజానికి చావు లాంటిది.
జీవరాసులన్నీ మనల్ని చూసి నవ్వుతున్నాయి..వెక్కిరిస్తున్నాయి.
దుర్మార్గులే కౌటిల్యుని రణతంత్రం చదివారా? మంచివాడికి చదువు రాదా? చదవలేదా?
భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చిమ్రోశిన శ్రీశ్రీ విశ్వనరుని స్వరం ఇంకా రోధిస్తూనే ఉంది.
ప్రతీ గ్రామం ఒక వెంటిలేటరే!! రేపటి సమాజపు సహజ సమాధులే!
సమసమాజం, నవసమాజం అంతా బూటకం.. అసంభవం. నిన్నటి ఆశాజీవులే రేపటి పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళునూ!!
Politicians are self-made, but people make them as Leaders..Pity..
వాళ్ళు స్వతహాగా రాజకీయాల్లోకి వస్తారు.. కానీ వాళ్ళని ప్రజలే నాయకుల్ని చేస్తున్నారు. అన్నీ అజ్ఞానపు ఆత్మహత్యలు, అహంకరపు ఆత్మహత్యలే!
ఇది పిచ్చివానికి వెర్రివాడు వ్రాయు లేఖ..
ఇట్లు ఒక వెర్రివాడు(పూర్వకాలపు ఆశాజీవి)
వశిష్ఠ✍️
Guruvaaa 👏
ReplyDeleteThanks Satyanvesi garu 😀😉
Delete👏🏻👏🏻👏🏻
ReplyDeleteThanks andi 😀😀🤗😀😀
DeleteBrilliant Bro.
ReplyDeleteThanks bro 😊😀😀😊
Delete