God of Gods

CHAPTER - 1
Year Zero - Day One - Hour Zero - Minute One
It's not the day when mother Earth was created, it's the day when humans started to record days as dates.

Once upon a time somewhere on this planet, there was a clan named "Unnamed". It's time to revive that clan in your minds, be their supreme being by bringing them back  for extinction and giving lives in your imagination. Officially you are a GOD.

They even employed you to fight against all evils and odds. You were given an Employee quarters too, under A BIG TREE.They started offering you daily rituals, prayers, puja's and prasaadhams. You are credited with many unknown victories and you were promoted too. No one questioned you and your existence. 

ఒక రోజు పూజ కి ఆలస్యం అయ్యింది అని నీకు కోపం వచ్చింది, వెనువెంటనే వారు ఉన్న అడవిలో కార్చిచ్చు రగిల్చావు. అడవి మొత్తం బుగ్గిపాలు అయ్యింది. నీకోపాన్ని గ్రహించిన ఊరి పెద్ద వచ్చి నీ కాళ్ళమీద పడితే మంటలు ఆర్పుతానని చెప్పి వర్షం కురిపించావు. మంటలు ఆగిపొయాయి,ఆరిపొయాయి కాని వర్షం మాత్రం ఆగలేదు.సూర్యుని తాపానికి సముద్రపునీరు ఆవిరి అయ్యి మేఘాలుగా మారి వర్షంగా పడినట్టు..అడవిలో చెలరేగిన మంటలకి వీళ్ళ కన్నీళ్ళు ఆవిరిగా మారి కుండపోతు వర్షంగా మారిందా!! అన్నట్టుగా వర్షం పడింది.మంటకి మిగిలిన వారిలో కొంతమంది వర్షానికి చనిపోయారు. ఈసారి నీ కాళ్ళ మీద పడటానికి ఊరి పెద్ద కూడ లేడు. జాలి కలిగి శాంతించావు. 

ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయమని అందరూ భయంతో నీ కాళ్ళ మీద పడ్డారు. నీ కొపం తగ్గింది అని చెప్పటానికి ఆకాశంలో ఒక ఉరుము ఉరిమావు, వాళ్ళు భయం భయం గా వెళ్ళి మిగిలిన చెట్ల క్రిందనే తలదాచుకున్నారు.

దూరం నుండి నిన్నే చూస్తున్న ఒక పిల్లాడి మెదడు లో ఒక ఆలోచన కలిగింది. అసలు నువ్వు ఎవరు అని? నిన్ను ఎవరైన చూసారా అని? కర్కశంగా వ్యవహరించి తన తల్లిని చంపేసావు అన్న కోపం అతనిలో వచ్చింది. బయటకి అడిగితే అతని తండ్రి పిల్లాడి మాటలకి ఇంకా భయపడి ఏమి చెప్పలో తెలియక వాడి తల్లి నీదగ్గరకే వెళ్ళింది అని, నువ్వే తన తల్లివి అని  చెప్పాడు.నిన్నే చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. 

 మరునాడు ఉదయం నిద్రలేస్తూనే నీ పతనం కోరుకున్నాడు ఆ పిల్లాడు. నీ ప్రపంచంలో నువ్వు ప్రాణం పోసిన ఒక జీవి నిన్ను అంతం చేయాలని నిర్ణయించుకుంది.నీ అనుమతిలేనిదే కనురెప్ప కూడా వేయలేని ప్రాణి నిన్ను అంతమొందించాలని అనుకోవడం ఏంటి? ఎవరు ఆ పిల్లవాడు? నీ ప్రపంచంలో నిన్ను మించిన శక్తా? కొంపతీసి ఆ పిల్లాడు దేవుడికే దేవుడా??   అసంభవం.. మరి ఆ పిల్లాడు ఎవరు? ఆ పిల్లాడు ఎవరో కాదు నువ్వే..అవును నువ్వే... నీతో నువ్వు చేయాల్సిన యుద్ధం తరువాయి భాగంలో...సిద్ధంగా ఉండు.లేకపోతే నీ చేతుల్లో నువ్వే...... to be continued



Thank you
Vamsikrishna Bazaru.










Comments

  1. 👏👏👏 waiting for next part 🤘

    ReplyDelete
  2. Thank you so much 😊🤗.. uploaded second chapter. Give a read here https://blogofviwo.blogspot.com/2020/06/god-of-gods-chapter-2.html?m=1

    ReplyDelete
  3. Chaala bagundi... creative!!!

    ReplyDelete
  4. Lovely writing . Chala bagundi andi

    ReplyDelete
  5. Just gone to the day 0/0/0 and witnessed every detail of the tail
    What a writing 🙏👌
    You just re given my imagination power ty ❤️

    ReplyDelete

Post a Comment

Popular Posts