నాకు తెలిసిన కళ్యాణ్

చెట్టెక్కిన బేతాళుడిని కిందకి తన భుజాల మీదకి దించి విక్రమార్కుడు మౌనంగా నడవసాగాడు. విక్రమార్కుడికి మౌన భంగం కలిగించదలచి బేతాళుడు ఈ విధంగా అంటున్నాడు...

రాజా! నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాదానం సరిగ్గా చెప్పాలి,తెలిసీ చెప్పకపోతే వచ్చే జన్మలో పేటీయం కుక్కవై పుడతావు అని అన్నాడు. విక్రమార్కుడు తల ఊపగా బేతాళుడు ప్రశ్న అడగనారంభించాడు.

మహాసముద్రపు మధ్యన చిన్న దీవిలో పవన్ కల్యాణ్, ఇంకో ఇద్దరు తన అభిమానులు చిక్కుకుని ఉన్నారు. ఇద్దరిలో ఒక అభిమాని చేతికి కేకు మరకలు, షర్టు పైన రంగు,పూల రేకులు ఉన్నాయి.చూస్తుంటేనే అర్ధమైపోతుంది పవన్ జన్మదిన వేడుకులని అట్టహాసంగా జరిపి వచ్చాడు అని. ఇంకొక అభిమాని చేతిలో జనసేన జెండా ఉంది.


ఈలోపు దేవుడు ప్రత్యక్షమయ్యి ముగ్గురితో ఈ విధంగా పలికాడు. మీ ముగ్గురిలో ఇద్దరిని మాత్రమే కాపాడుతాను.ఆ ఇద్దరిలో మొదటి వ్యక్తి కల్యాణ్. రెండో వ్యక్తి ఎవరో తేల్చుకోండి అని అంటాడు. ముందుగా జనసేన జెండా పట్టుకున్న అభిమాని మీకోసం,మన పార్టీ కోసం రేయింబవళ్ళు కష్టపడ్డాను,వాడు కేవలం మీ సినిమా అభిమాని మాత్రమే,నేనే మీకు ఎక్కువ ఉపయోగ పడ్డాను,పడతాను కూడా!! నన్నే కాపాడమని దేవుడిని అడగండి అని కళ్యాణ్ తో అంటాడు.


ఇది విన్న సినిమా అభిమాని కట్టలు తెంచుకున్న కోపంతో అసలు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాతే అన్నకి మనశ్శాంతి లేకుండా పోయింది. నేను చూడు నా సంపాదనలో సగం బ్యానర్లకి,కేకులకి,సినిమా రిలీజ్ రోజు హంగామాకే ఖర్చు పెట్టేస్తా. నా అంత పెద్ద అభిమాని ఎక్కడా ఉండడు.నువ్వు పార్టీ జెండానే మోస్తావు ఏమో..నేను పవనన్న కోసం ప్రాణాలైనా ఇస్తాను.నన్నే కాపాడు పవనన్న అని పవన్ ని అడుగుతాడు.



భేతాళుడు కధ చెప్పడం ఆపి పవన్ కళ్యాణ్ ఏం చేసి ఉంటాడో చెప్పు రాజా! అని అడిగి తెలివైన వాడైతే అరుపులు,ఈలలు,కేకలు వేసే సినిమా అభిమానిని అక్కడే వదిలేసి, రాజకీయంగా ఉపయోగపడే కార్యకర్తని తనతో పాటు కాపాడమని అడుగుతాడు అని భేతాళుడు తనే ఒక సమాధానం చెప్పాడు.

నువ్వు కూడా ఇదే అనుకుంటున్నావు కదా అని అన్నాడు.

విక్రమార్కుడు చెప్పడం ప్రారంభించాడు...

అవసరం ఉన్నవాడితో మంచిగా ఉండి, అవసరం లేని వాళ్లని పొమ్మనే రకం కాదు కళ్యాణ్. అదే కళ్యాణ్ కి మిగితా రాజకీయవేత్తలకి తేడా!

ఇంక ఎవరిని కాపాడతాడు అంటావా?? 

ప్రజలనే తనకి ఓటు వేశారా? లేదా? అని విభజించి చూడడు.

ఓట్లు వేస్తారని ఉద్దానానికి ఊపిరి పోయలేదు. ఓట్లు వేయలేదని అమరావతి రైతుల సమస్యతో నాకేం పని అని అనలేదు.

అలాంటిది తనని అభిమానించే వాళ్లని వేరుగా చూస్తాడా? అభిమానులనే కాదు మనుషులనే వేరుగా చూడడు. అందరి ప్రాణాలకి ఒకేలా విలువ ఇస్తాడు. 

అంటే ఏంటి..ఒక్కరినే కాపాడాలి కదా! ఎవరిని కాపాడతాడు అంటావ్? అభిమానుల ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తను అక్కడే ఉండిపోతాను అని అడుగుతాడా? 

దానికి దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే  అలా అని తన అభిమానులతో తాను అక్కడే ఉండిపోతాడా?  అని బేతాళుడు తిరిగి ప్రశ్నించాడు. 


అప్పుడు విక్రమార్కుడు నవ్వి..ఇక్కడే కిటుకు ఉంది. దేవుడు ఇప్పుడే కాపాడతాను అనే అన్నాడు కానీ నేను లేనిదే మీరు బ్రతకలేరు, అస్సలు మీరు బ్రతకరు అని అనలేదు కదా!! ఇక్కడ అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒకడిని చంపి,ముంచి అడ్డ దారుల్లో త్వరగా గమ్యం చేరడం పవన్ స్వభావం కాదు. అలస్యమైతే అయ్యింది మనతో అందరిని క్షేమంగా గమ్యం చేర్చడం నాయకత్వ లక్షణం.పవన్ లక్షణం.

అన్నిటి కంటే ముఖ్యం అతను దేవుడి మీదే భారం వేయలేదు. తనకి కాపాడుకోగలను అన్న నమ్మకం ఉంది. అక్కడే ఉండిపోయే స్వభావి కాదు, ఎంత కఠినమైనా గమ్యం చేరే సాహసి. 


ఓడిపోయాడు  ఓడిపోయాడు ఓడిపోయాడు అంటున్నారు కదా!!

దొంగతనంగా పండు కోయడం తేలికే కానీ విత్తు నాటి మొక్కకి కంచే వేసి,నీరు పోసి పెంచడం మాత్రం చాలా కష్టం కదా! దొంగతనం చేసిన వాడికి భయం ఉంటుంది. తను పెంచిన చెట్టు కాయ కోసుకునే వాడికి ఏ భయం ఉండదు. పై పెచ్చు యజమాని అన్న గౌరవం ఉంటుంది. పక్కనోడి సొమ్ము తిని బలిసినోడు

కష్టం చేసి ఒళ్ళు పులిసినోడి కన్నా బలంగాను, భయంగాను ఉంటాడు. ఉంటాడు.


ఇంకొక విశేషం ఏంటి అంటే కళ్యాణ్ ఆ కష్టపడిన యజమాని కాదు.మరి? 

ఆ చెట్టు లాంటి నిస్వార్ధపరుడు కళ్యాణ్. ప్రజలే ప్రజాస్వామ్యంలో యజమానులు అని గుర్తుచేస్తున్నాడు, వాళ్ళు కోల్పోయిన గౌరవం కోసం తిరిగి రావడం కోసం తను పాటుపడుతున్నాడు.


ఆఖరికి కళ్యాణ్ దేవుడిపైనే భారం వేయకుండా పరిపక్వత లేని అభిమానిని(నాతో సహా), తన స్వార్ధం మాత్రమే చూసుకున్న ఇంకో అభిమానిని ని వెంటనెట్టుకుని బయలుదేరగా వీళ్ళని పెట్టుకుని వెళ్తున్నావ్ సాహసమే అని దేవుడు నవ్వి మాయమయ్యాడు. దైర్యంగా పోరాడి ఒడ్దుకి చేరాడు.


ఒడ్డున నిస్వార్ధ పరులైన జనసైనికులు పవన్ రాక కోసం ఎదురు చూస్తూ,  ఏమి ఆశించకుండా సమాజ సేవ చేస్తూనే ఉన్మారు.

వాళ్లే అతని బలం.అతని ఆశ.అతని నమ్మకం. అతని కాడెత్తే ఆ నలుగురు...

ఇతనే నాకు తెలిసిన కళ్యాణ్...

అని విక్రమార్కుడు చెప్పగా శుభమస్తు అని పలుకుతూ భేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కాడు.



To my best friend, leader, teacher and co- Indo Human Pawankalyan

From Vamsikrishna Bazaru.


Comments

  1. Nijam ga Ivaala tho fix avuthunna ... Neelo writing skills ni next level ki tiskelley time ochindhi..
    Nee presentation ki fidaa ayya...
    Nuvvey na rachanala guruvu...

    🙏🏻🙏🏻
    Jai Hindh

    ReplyDelete
    Replies
    1. Thanks bava... Whole credits to kalyan..alanti situation lo Kalyan em chesthado adhe rasanu,😍🤗

      Delete
  2. Kudos🙏 to your writing thammudu....#ChotaGuruji

    ReplyDelete

Post a Comment

Popular Posts