God of Gods - Chapter 2

God of Gods - Chapter 2

ఇంతకుముందు మనిషివి..ఇప్పుడు దేవుడివి...అందుకని నీకు ఇప్పుడు నీ  మనిషి జీవితంలో తర్వాత ఏం జరగబోయేదో కనపడుతుంది.
నీకు ఎవరెవరో కనిపిస్తున్నారు.కానీ వాళ్లని ఎక్కువసేపు చూడలేకపోతున్నావు.
నువ్వు వాళ్ళని చూసి నవ్వుతున్నావు. నిన్ను చూసి వాళ్లు నవ్వుతున్నారు. నువ్వు చేసిందే వాళ్ళు చేస్తున్నారని నీకు ఇంకా ఇంకా నవ్వు వస్తుంది.
ఒక్కసారిగా నీకు కోపం వస్తుంది. అరుస్తున్నావు.వాళ్ళు నిన్ను ఎత్తుకుంటున్నారు.నువ్వు  అలా చేస్తున్నప్పుడల్లా ఏడుస్తున్నావ్ అని వాళ్ళు  అనడం వల్ల ఆ పని పేరు 'ఏడవటం' అని,నీకు అసౌకర్యంగా అనిపించినప్పుడు నువ్వు చెసే పని పేరు 'కోపం' అని  అర్ధమైంది.
నువ్వు ఎంతో ఇష్టంతో చేసే పని పేరు 'నవ్వడం' అని తెలుసుకుని ఇంకా ఇంకా నవ్వుతున్నావ్.
నువ్వు ఏడుస్తుంటె వాళ్లు ఏవేవో నీకు నచ్చేవి చూపిస్తున్నారు,చేస్తున్నారని అర్ధమయ్యి కావాలని  మరీ ఏడుస్తున్నావు.గొప్ప మేధావివి నువ్వు.

నీకు తరచుగా రెండు మాటలు వినపడుతున్నాయి,రెండు జీవులు కనపడుతున్నాయి. ఒకటి నాన్న, రెండు అమ్మ. ఆమ్మకన్నా నాన్న అనే పదమే ఎక్కువ వినపడుతుంది.ఒక మనిషి నీదగ్గరకి వచ్చినప్పుడల్లా అతని నుండి నాన్న అనే మాట వింటున్నావు.
మాట,మనిషిని బట్టి ఆ వ్యక్తి నాన్న అని నీకు అర్ధం అయ్యింది,అంటే రెండో వ్యక్తి ఆమ్మ. పెద్ద శాస్త్రవేత్తవి నువ్వు.

అమ్మానాన్న ఇద్దరి నోటి నుండి ఒకే పదం రావడం,అది నిన్ను చూస్తూ అనడం విని అది నీ పేరు అని ఫిక్స్ అయ్యావు.
నీకు ఇంకొక శబ్దం వినిపిస్తుంది,అదేంటో అర్ధమవ్వట్లేదు.  నాన్నంటే ఇష్టం కాబట్టి ఆ అర్ధంకాని పదాన్ని నాన్న అని అనేసుకున్నావు.


నాన్న నోటి నుండి "నాన్న" అన్న పదం వచ్చినంతగా లాగా అమ్మ నోటి నుండి "అమ్మ" అనే పదం రావట్లేదు.
నాన్న నిన్ను అప్పుడప్పుడూ అమ్మ అని కూడా పిలుస్తున్నాడు.


ఒకరోజు అమ్మనీకు స్నానం చేయించి బట్టలు వేసి తయారు చేసి నీకు ఏదో చూపిస్తూ ఇంకేదో చెప్పింది. ఆమ్మ అప్పుడు నీకు చెప్పిన అన్ని మాటల్లోకి దేవుడు అనే పదం నచ్చింది. దేవుడు...దేవుడు...దేవుడు....
నీకు దేవుడు కూడా బాగా నచ్చాడు.ఎంత బాగా నచ్చింది అంటే...నువ్వు నీకు ఇష్టమైన పని 'నవ్వడం' చేస్తూనే ఉన్నావు...నవ్వుతూనే ఉన్నావు.
గుర్తుపెట్టుకున్నావు.
అమ్మానాన్న లాగ ఇంకో వ్యక్తి దేవుడు అన్నమాట. 


అమ్మ నిన్ను చూసి ఏదో అంటూ అన్నం పెట్టింది.ఎం అన్నదో నీకు అర్ధమవ్వలేదు.పెడుతూ ఉండగా..మళ్లీ అదేమాట అన్నది.
ఆమాట వినగానే నీకు ఎవరు కనపడలేదు.మళ్లీ  అన్నది. నువ్వు అమ్మానాన్నని ఎక్కువసేపు ఎందుకు చూడలేకపోతున్నావో నీకు ఇప్పుడు అర్ధమైంది.  దానికి కారణం 'నిద్ర' అన్నమాట. అమ్మ అన్న మాట 'నిద్ర వచ్చేసింది మా బంగారుకి'.

నిద్ర మధ్యలో ఏడుస్తున్నావని నాన్న రోజు లానే నిన్ను తన దగ్గరకి తీసుకుని ఆడిస్తూ నిద్రపుచ్చుతున్నాడు. నాన్న అలా ఆడించడం నీకు ఇష్టం.అందుకే కావాలని ఏడ్చావు. నీ నటనకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

నీకు ఏదో ఆలోచన మొదలు అయ్యింది.
ఇందాక దేవుడి చూపించిన తరువాత..అమ్మ ఏదో చూపిస్తూ 'అమ్మ' అని చెప్పింది.అంటే  లెక్క ప్రకారం..ఇందాక చుపించిన వ్యక్తి దేవుడు ఐతే ఇప్పుడు  అమ్మ చూపించిన వ్యక్తి కూడా అమ్మ అన్నమాట. నాకు ఇద్దరు అమ్మలు అన్నమాట అనుకున్నావు. కాని ఇద్దరూ ఒకేలా లేరేంటి??? నీకేం అర్దంకాలేదు!
నేను చూసినావిడ అమ్మ అయితే మరి అమ్మని చూపించిన అమ్మ ఎవరు? 
నాన్న నోటి నుండి నాన్న అన్న పదం వచ్చినంతగా లాగా అమ్మ నోటి నుండి అమ్మ అనే పదం రావట్లేదు. పైగా నాన్న నోటినుండే అమ్మ అని ఎక్కువ సార్లు వినపడుతుంది. అంటే ఇంట్లో ఉన్న ఆవిడ నీకు,నాన్నకి ఇద్దరికి అమ్మా? అలా ఐతే ఫోటోలో ఉన్న ఆమె ఎవరు? నీ చిన్నబుర్రకి అర్ధం అవ్వట్లేదు.
ఉలిక్కిపడి లేచి అమ్మా అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టావు. నాన్న నీ దగ్గరకి వచ్చి నిన్ను ఆడిస్తున్నాడు.నువ్వు ఏడుపు మాత్రం ఆపకపోయేసరికి ఆయన అమ్మ దేవుడి దగ్గరకి వెళ్ళిపోయింది అని అన్నాడు. నీకు కొంచెం అర్ధమైంది..అమ్మ నీకు ఎంతో ఇష్టమైన దేవుడి దగ్గర ఉంది అని. ఏడుపు మాని నవ్వడం మొదలుపెట్టావు.
నవ్వుతూ నాన్నని చూసావు.నాన్న నీకు లాగా ఏడుస్తున్నాడు. నాన్నని కూడా ఎత్తుకోవాలి అనుకుంటా..అందుకే ఏడుస్తున్నాడు అనుకున్నావు.
ఈలోపు అమ్మ రావడంతో నాన్న కళ్లు తుడుచుకుని..నీతో "వెళ్లి నానమ్మతో పడుకో" అని అనేసరికి నీకు ఇన్ని రోజులు అర్ధం అవ్వని  పదం అర్ధమైంది. ఆ పదమే నానమ్మ. ఇంట్లో ఉన్నది నానమ్మ. దేవుడితో ఉన్నది అమ్మ. ఇన్నిరోజులు ఇంట్లో విన్న అమ్మ అనే పదం నాన్న నానమ్మ ని  పిలిచినప్పుడు. అమ్మ దేవుడిదగ్గర ఉంది అని నీకు ఆనందమేసింది. నవ్వుతూనే నిద్రపోయావు. 

అప్పుడు నీ వయస్సు 18 నెలలు.

To be continued...

Thankyou

Vamsikrishna Bazaru.


Link for God of Gods Chapter3 https://blogofviwo.blogspot.com/2020/06/god-of-gods-chapter-3.html

Link for God of Gods Chapter 1 https://blogofviwo.blogspot.com/2020/05/god-of-gods.html?m=1

Please comment below 😊

Comments

Post a Comment

Popular Posts